Exit Polls and Pre Polls - All You Need To Know | Oneindia Telugu

2018-12-08 170

In addition to the pre-election presents, the polling exit polls are also heavily predicted. Those who win, who will come to power, take priority. The exit polls in this segment will take precedence.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎలక్షన్లకు ముందు సర్వేలు హడావిడి చేస్తే.. పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు. విజయం ఎవరిని వరించనుంది. అధికారంలోకి ఎవరొస్తారు. ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా మారాయి. ఈనెల 11న వచ్చే ఫలితాల కోసం ఎదురుచూసే జనాలకు ఈ ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎన్నికలకు ముందు జరిగే ప్రిపోల్స్ తో పాటు.. ఓటింగ్ ముగిశాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ పై కూడా భారీగా అంచనాలు ఉండటంతో వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఈక్రమంలో అసలు ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు? ప్రిపోల్స్ కు ఎగ్జిట్ పోల్స్ కు తేడా ఏమిటి?